Sunday, December 22, 2024
Homeక్రైంరైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌

రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌

Date:

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ప్రేమ్‌పుర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఢీల్లీ-హౌరా రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అమర్చిన ఘటన ఆదివారం గుర్తించారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ , రైల్వే పోలీసులు అక్కడకి చేరుకుని పరిశీలిస్తున్నారు. పట్టాలపై ప్రమాదాన్ని గుర్తించే సమయానికి లూప్‌లైన్‌లో కాన్పూర్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ఒక గూడ్స్‌ రైలు వెళుతోంది. ఒక ఎక్స్‌ప్రెస్‌ రైలుకు దారి ఇచ్చే క్రమంలో దాని ఆపాల్సి వచ్చింది. అప్పుడు లోకోపైలట్‌ సిలిండర్‌ను గమనించి తక్షణమే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది.

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌లో రైలు పట్టాలపై 10 డిటోనేటర్లను బుధవారం గుర్తించారు. సగ్పట రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. జమ్మూకశ్మీర్‌ నుంచి కర్ణాటకకు ఈ మార్గంలో సైనికులను తరలిస్తున్న రైలు కింద ఇవి బయటపడ్డాయి. ఒకటి పేలడంతో లోకోమోటీవ్‌ పైలట్‌కు అనుమానం వచ్చి రైలును ఆపేసి అధికారులకు సమాచారం అందించారు. వారు పట్టాలపై పేలుడు పదార్థాలు ఉన్నట్లు పసిగట్టారు. రైళ్లను పట్టాలు తప్పించి, ప్రమాదాలకు గురిచేసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని కేంద్రం పేర్కొంది. ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు వెలుగుచూశాయని రైల్వేశాఖ ఇటీవల తెలిపింది.