Wednesday, January 15, 2025
Homeక్రైంపోర్న్ చూడాల‌ని బాలిక‌ను బ‌ల‌వంతం చేసిన టీచ‌ర్‌

పోర్న్ చూడాల‌ని బాలిక‌ను బ‌ల‌వంతం చేసిన టీచ‌ర్‌

Date:

విద్యార్థుల‌కు తండ్రి స్థానంలో ఉండాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో పోర్న్ చూడమని బాలికను బలవంతం చేశాడు. ఆ విద్యార్థిని అసభ్యకరంగా తాకాడు. ఆ బాలిక దీని గురించి తల్లికి చెప్పింది. ఆగ్రహించిన స్థానికులు ఆ టీచర్‌పై దాడికి ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ స్కూల్‌ను ధ్వంసం చేశారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 12న ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తరగతి గదిలో అశ్లీల చిత్రాలు చూడమని ఆమెను బలవంతం చేశాడు. ఆమెను అనుచితంగా తాకాడు.

జరిగిన దాని గురించి తన కుటుంబానికి చెప్పేందుకు తొలుత ఆ బాలిక సంకోచించింది. చివరకు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఇది తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వ స్కూల్‌ వద్దకు వెళ్లి ఆ టీచర్‌పై దాడికి యత్నించారు. అతడు తప్పించుకుని పారిపోవడంతో స్కూల్‌కు నిప్పుపెట్టారు. మరోవైపు ఆ టీచర్‌పై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తునట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్‌ ఆస్తులకు స్థానికులు నష్టం కలిగించినందున వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.