Friday, January 3, 2025
Homeక్రైంతండ్రితో పాటు ప్రిన్సిపాల్‌ అవ‌మానించారు..

తండ్రితో పాటు ప్రిన్సిపాల్‌ అవ‌మానించారు..

Date:

నాన్న న‌న్ను త‌ర‌గ‌తి గ‌దిలో ప్రిన్సిపాల్ ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్టావంటూ కొట్టాడ‌ని ఇంటికి వ‌చ్చి తండ్రికి చెప్పింది. తండ్రి కూడా పాఠ‌శాల‌కు వచ్చి తోటి విద్యార్థుల ముందు తనను కొట్టాడని భరించలేని ఓ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శభాష్ గూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలలో జరిగిన ఓ పరీక్షలో కాపీ కొడుతున్న విద్యార్థిని గమనించి అతన్ని కొట్టడంతోపాటు తండ్రికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విద్యార్థి తండ్రి పాఠశాలకు వచ్చి తోటి విద్యార్థుల ఎదుట కొట్టాడు.

ప్రిన్సిపల్‌తోపాటు తండ్రి కూడా చేయిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఆ విద్యార్థి.. శనివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టువద్దకు వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కొమురవెల్లి ఎస్సై రాజు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.