Wednesday, January 15, 2025
Homeక్రైంగుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ చెపుతూ బాలిక‌పై వేధింపులు

గుడ్ ట‌చ్ బ్యాడ్ ట‌చ్ చెపుతూ బాలిక‌పై వేధింపులు

Date:

స‌మాజంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అమ్మాయిల‌ను కాపాడుకోవ‌డం నేటి ప్ర‌ధాన బాధ్య‌త ఐపోయింది. కొంత‌మంది చిన్నారులకు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించాలని ఎంతో మంది పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడు పాఠశాలలోని విద్యార్థులకు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించే నెపంతో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలోని ఓ పాఠశాలలో పిల్లలకు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై 67 ఏళ్ల వృద్ధుడితో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నిందితుడు గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పించే నెపంతో 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో మరుసటి రోజు అవగాహన కల్పిస్తూ నిందితుడు మరికొంత మందితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేసింది. ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేయగా వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి తెలిపారు.