Thursday, December 26, 2024
Homeక్రైంఖైదీతో స‌హా ప్ర‌తి వ్యక్తి గౌర‌వానికి అర్హురాలు

ఖైదీతో స‌హా ప్ర‌తి వ్యక్తి గౌర‌వానికి అర్హురాలు

Date:

ఖైదీతో స‌హా ప్ర‌తి వ్య‌క్తి అర్హుల‌ని, జైలులో కాన్పు వల్ల పుట్టే బిడ్డతోపాటు తల్లిపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రసవం కోసం నిండు గర్భిణీకి ఆరు నెలల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. 2024 ఏప్రిల్‌లో గోండియా రైల్వే భద్రతా దళం రైలులో తనిఖీలు చేసింది. మాదక ద్రవ్యాలు కలిగిన సురభి సోనితో సహా ఐదుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. 33 కిలోల గంజాయిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్‌ నాటికి సోనీ రెండు నెలల గర్భవతి. ప్రస్తుతం నెలలు నిండటంతో మానవతా దృక్పథంతో కాన్పు కోసం బెయిల్‌ మంజూరు చేయాలని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంబ్‌ను ఆమె ఆశ్రయించింది. అయితే సోనీ విజ్ఞప్తిని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. ఆమె డెలివరీ కోసం జైలులో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు చెప్పారు. మరోవైపు జస్టిస్ ఊర్మిళా జోషి నేతృత్వంలోని సింగిల్ బెంచ్, సోనీ పిటిషన్‌పై విచారణ జరిపింది. జైలు వాతావరణంలో బిడ్డను ప్రసవించడం తల్లితోపాటు పుట్టే బిడ్డపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ఖైదీతో సహా ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హులని స్పష్టం చేసింది. మానవీయ కోణంలో కూడా పరిగణించాలని పేర్కొంది. జైలు బయట కాన్పు కోసం సురభి సోనీని ఆరు నెలలు తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. నవంబర్‌ 27న ఈ మేరకు తీర్పు ఇచ్చింది.