Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు

భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు

Date:

ఏడుకొండల వాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ నేపథ్యంలో తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిశాయి. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భక్త జనం భారీగా తరలివస్తున్నారు. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో శిలా తోరణం కూడలి నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించాలని తితిదే అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తజనం గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి.

గరుడోత్సవంలో భాగంగా సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీమలయప్పస్వామి మాడవీధుల్లో విహరించనున్నారు. సుమారు 3.5 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు ఆస్కారం ఉంది. గ్యాలరీల్లో సుమారు రెండు లక్షల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు, గరుడ వాహన సేవకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. గరుడ సేవకు 400లకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసిన అధికారులు.. 3వేల ట్రిప్పులు నడిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.