Saturday, December 21, 2024
Homeఆంధ్రప్రదేశ్అక్ర‌మ ఆస్తులు అంటూ త‌హ‌శీల్దార్‌కు బెదిరింపు

అక్ర‌మ ఆస్తులు అంటూ త‌హ‌శీల్దార్‌కు బెదిరింపు

Date:

రోజురోజుకు సైబ‌ర్ కేటుగాళ్ల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. సాధారణ ప్రజల నుంచి అధికారుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా చేజర్ల మండల తహసీల్దార్‌ (ఎంఆర్‌వో)కు టోకరా వేసి ఏకంగా రూ.3.50 లక్షలు కాజేశారు. తాము ఏసీబీ అధికారులమని పేర్కొంటూ ఎంఆర్‌వోకు సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులన్నాయని.. వెంటనే రూ.5 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. తమకు డబ్బు ఇవ్వకుంటే అక్రమాస్తుల కేసు నమోదు చేస్తామని బెదిరించారు.

దీంతో ఎంఆర్‌వో వారు సూచించిన ఖాతాలకు తన బంధువుల ద్వారా రూ.3.50 లక్షలు బదిలీ చేయించారు. చివరికి అసలు విషయం తెలిసి.. మోసపోయానని గ్రహించిన తహసీల్దార్‌ వెంటనే సంగం సీఐ వేమారెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పలువురు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఇలాగే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి బెదిరించినట్లు సమాచారం ఉందని పోలీసులు తెలిపారు.