Wednesday, January 15, 2025
HomeUncategorized5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

Date:

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వ‌ర‌ద బాధితుల‌కు గత ఐదు రోజులుగా సుమారు 10 లక్షల మందికి ఆహారం అందించామని అక్షయపాత్ర విజయవాడ, గుంటూరు ప్రెసిడెంట్‌ వంశీదాస ప్రభు చెప్పారు. దివీస్‌ ల్యాబ్‌, ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం ఎప్పుడు, ఎంత అడిగినా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వంశీదాస చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతోనే ఇంత మందికి అందించగలిగామన్నారు. తాము ఎంత ఆహారం వండినా .. దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు. అక్షయపాత్ర చరిత్రలో 10లక్షల మందికి ఆహారం అందించడం రికార్డు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.