Sunday, September 22, 2024
HomeUncategorizedపుదుచ్చేరిలో పీచు మిఠాయిలు నిషేధం

పుదుచ్చేరిలో పీచు మిఠాయిలు నిషేధం

Date:

పిల్లలు పీచు మిఠాయిలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అయితే ఆకారంలో కొత్తగా, పెద్దగా కనిపించే కాటన్ క్యాండీలను పిల్లలు మరింత ఇష్టపడతారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ స్వీట్, ఒక రకం పీచు మిఠాయిగా లభిస్తోంది. అయితే రంగు, రుచి కోసం వీటిలో కొన్ని రకాల రసాయనాలు, కృత్రిమ రంగులు, స్వీటెనర్లు కలుపుతున్నారు. తాజాగా పుదుచ్చేరి అధికారులు ఇలాంటి చర్యలపై సీరియస్ అయ్యారు. అనారోగ్యానికి గురిచేసే కెమికల్స్‌ ఆనవాళ్లను అధికారులు కాటన్ క్యాండీల్లో గుర్తించారు. దీంతో పుదుచ్చేరిలో వీటిని బ్యాన్ చేశారు. ఈ నిషేధాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రకటించారు. ఎవరూ పీచు మిఠాయిలు కొని తినవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు కాటన్ క్యాండీల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారని తమిళిసై చెప్పారు. అందుకే వీటిని నిషేధిస్తున్నామని, ఎవరూ వీటిని తినకూడదని ప్రజలను హెచ్చరించారు. కాటన్ క్యాండీల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని చెబుతూ అందుకు ఆధారాలు చూపేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా తమిళిసై పోస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు మిఠాయిలోని కొన్ని నమూనాలను పరీక్షించారని, వాటిలో ప్రమాదకరమైన కలర్ కాంపౌండ్ రోడమైన్-బి ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. స్ప్రింగ్ పొటాటోస్, ఫిష్ ఫ్రైలు, భజ్జీలు వంటి ఇతర రంగుల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని తమిళిసై ప్రజలకు సూచించారు.