Sunday, September 22, 2024
HomeUncategorizedప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమా.. !

ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమా.. !

Date:

అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని రేవంత్ ఆరోపించారు. ”కృష్ణా జలాలపైనే దక్షిణ తెలంగాణ ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాలి. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవద్దని, తెలంగాణకు 68 శాతం కృష్ణా జలాలు ఇవ్వాలని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు… ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు తెలిపి ఉండాల్సింది. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీటి కోసం ఒకే మాటపై నిలబడతామని” సీఎం రేవంత్ అన్నారు.

గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టడంతో అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వెళ్లారని, మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. మరోవైపు కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీశ్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెప్పారు. దయచేసి ఆయనకు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించాలని అభ్యర్థించారు. పద్మారావు నిజమైన తెలంగాణవాది… తెలంగాణ కోసం పోరాడే వ్యక్తి అని… అలాంటి వ్యక్తిని ప్రతిపక్ష నేతగా నియమిస్తే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకపోవడం, రెండు తెలంగాణకు 68 టీఎంసీల నీరు రావాలి. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని అన్నారు.