Wednesday, January 22, 2025
Homeప్రత్యేక కథనాలుఆమె ఆస్తులు రూ.775 కోట్లు.. రూ.7 లక్షల కోట్ల కంపెనీ, కాని కుంభమేళాకు సాధారణ మహిళల...

ఆమె ఆస్తులు రూ.775 కోట్లు.. రూ.7 లక్షల కోట్ల కంపెనీ, కాని కుంభమేళాకు సాధారణ మహిళల వచ్చారు..

Date:

కోట్లాది రూపాయల సంపద ఉన్న అత్యంత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడేవారిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి ముందు ఉంటారు. ఇప్పటికే సుధా మూర్తి సింప్లిసిటీ చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ మహిళగా వచ్చి, మరోసారి వార్తల్లో నిలిచారు.

*కుంభమేళాలో సుధా మూర్తి*


ధనవంతులు విమానాశ్రయాల నుంచి బయటకి వచ్చేటప్పుడు 4-5 బ్యాగులతో కనిపిస్తుంటారు. వారి వెనుక సపోర్టింగ్ స్టాఫ్, బౌన్సర్లు ఉంటారు. కానీ కుంభమేళాకు వచ్చిన సుధా మూర్తి ఒక చిన్న బ్యాగ్‌ మాత్రమే తీసుకెళ్తూ కనిపించారు. అది కూడా భుజానికి తగిలించుకునేది. ఎలాంటి హడావుడి లేకుండా ఆమె అందరిలో ఒకరిలా కుంభమేళాలు వచ్చి పుణ్యస్నానం చేశారు.

*ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది..*


ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రయాగ్‌రాజ్‌కి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళాలో పుణ్య సాన్నం ఆచరించడం అదృష్టమని చెప్పారు. ఇక్కడే మూడు రోజులపాటు ఉండి, పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.

*సాధారణ జీవితమే ఇష్టం*


ఇన్ఫోసిస్ కంపెనీ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి. వీరిద్దరి నెట్‌ వర్త్‌ దాదాపు రూ.45,000 కోట్లు ఉంటుందని అంచనా. అయినా ఎప్పుడూ ఆ గర్వం ఆమెలో కనిపించరు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా, అతి చేయకుండా చాలా సాధరణ జీవనశైలి గడపడానికి ఇష్టపడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రూ.775 కోట్ల ఆస్తులు ఉన్న సుధా మూర్తి, ఎల్లప్పుడూ సాధారణ చీరల్లో కనిపిస్తారు. ఓ సందర్భంలో ఆమె గత 30 ఏళ్లలో ఆమె తన కోసం ఒక్క చీర కూడా కొనలేదని తెలిపారు. తనకు ఇతరులకు బహుమతిగా ఇచ్చిన చీరలనే వాడుతున్నానని చెప్పారు.

*కాశీలో సుధా మూర్తి ఏం వదిలేశారు?*


ఈ నిర్ణయం వెనక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. చాలా ఏళ్ల క్రితం సుధా మూర్తి కాశీ వెళ్లారు. అక్కడి గంగా నదితో భక్తులు తమకు ఇష్టమైన దాన్ని వదిలేయాలని పండితులు చెబుతుంటారు. ఆ సమయంలో సుధా మూర్తి తనకు చాలా ఇష్టమైన చీరలను కొనడం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయానికి నేటికీ కట్టుబడి ఉన్నారు. ఇది ఆమె విలువలకు, బలమైన నిబద్ధతకు నిదర్శనం.