గంగమ్మ తల్లి ఆశీస్సుల కంటే తనకు ఏదీ గొప్ప కాదని అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. కుటుంబంతో కలిసి మంగళవారం మహా కుంభమేళాకు వెళ్లిన ఆయన.. అక్కడ ప్రార్థనలు, ఆరతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహా కుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, అందుకు తాను ప్రధాని నరేంద్రమోడీకి, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
అంతకుముందు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోగానే ఆయన ఇస్కాన్ టెంపుల్ వారితో కలిసి మహా కుంభమేళాలోని ఇస్కాన్ క్యాంపులో మహా ప్రసాదం తయారీలో పాల్గొన్నారు. ఇస్కాన్ టెంపుల్ వారు కుంభమేళా కొనసాగినన్ని రోజులు భక్తులకు ఉచితంగా భోజనం అందించనున్నారు. మహా కుంభమేళాలో ఇస్కాన్, అదానీ గ్రూప్ సంయుక్తంగా భక్తులకు ఉచిత భోజనం పెట్టాలని ఈ నెల 9ననే నిర్ణయించారు. మహా కుంభమేళా ముగిసేసరికి దాదాపు 50 లక్షల మందికి ఈ జాయింట్ క్యాంపు ద్వారా భోజనం పెట్టనున్నారు.