ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఢిల్లీలోని వివిధ నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగనున్న మొత్తం 15 మంది అభ్యర్థుల జాబితాను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు విడుదల చేశారు. న్యూఢిల్లీ నుంచి శుభి సక్సేనా, పాలం నుంచి వీరేందర్ తివారీ, మాలవీయనగర్ నుంచి రాంనరేష్ నిషాద్ బరిలో దిగబోతున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ప్రస్తుతం నామినేషన్ల దాఖలు కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఈ నెల 18న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలో ఈసారి అధికార ఆమ్ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమ త్రిముఖ పోరు నెలకొంది.