Thursday, January 9, 2025
Homeజాతీయంమ‌హిళ‌ల శ‌రీరంపై కామెంట్ చేసినా లైంగిక వేధింపే

మ‌హిళ‌ల శ‌రీరంపై కామెంట్ చేసినా లైంగిక వేధింపే

Date:

మ‌హిళ‌ల శ‌రీరంపై ఏలాంటి వ్యాఖ్య‌లు చేసినా, అది లైంగిక వేధింపు అవుతుంద‌ని కేర‌ళ హైకోర్టు పేర్కొన్న‌ది. జ‌స్టిస్ ఏ బ‌ద‌రుద్దీన్ ఈ తీర్పును ఇచ్చారు. కేర‌ళ విద్యుత్తు శాఖకు చెందిన ఓ మ‌హిళా ఉద్యోగినిపై మ‌రో ఉద్యోగి కామెంట్ చేశారు. దీంతో ఆమె లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేసింది. ఆ కేసును కొట్టివేయాల‌ని కోరుతూ ఆ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించాడు. 2013 నుంచి ఆ ఉద్యోగి చాలా అస‌భ్య‌క‌ర‌మైన భాష‌ను వాడార‌ని, 2017లో అభ్యంత‌ర‌క‌ర‌మైన మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ చేసేవాడ‌ని ఆమె ఆరోపించింది. విద్యుత్తు శాఖకు ఫిర్యాదు చేసినా ప్ర‌యోజ‌నం లేకుండాపోయిందన్నారు.

మ‌హిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ(లైంగిక వేధింపులు), 509(మ‌హిళ‌ను కించ‌ప‌ర‌చ‌డం), సెక్ష‌న్‌120(ఓ) కింద కేసు బుక్ చేశారు. కేర‌ళ పోలీసు చ‌ట్టంలోని సెక్ష‌న్ 120(ఓ) కింద కూడా ఆ ఉద్యోగి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. అయితే కేవ‌లం శ‌రీర శౌష్ట‌వం బాగుంద‌ని కామెంట్ చేసినంత మాత్రానా.. త‌న‌పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు చేశార‌ని, ఆకేసును కొట్టివేయాల‌ని విద్యుత్తు శాఖ ఉద్యోగి కోర్టును ఆశ్ర‌యించారు. కాల్స్‌, మెసేజ్‌ల‌తో నిందిత వ్య‌క్తి లైంగిక వేధింపుల కామెంట్స్ చేసిన‌ట్లు మ‌హిళా ఉద్యోగి ఆరోపించింది. అయితే ఐపీసీలోని సెక్ష‌న్ 354ఏ, 509తో పాటు సెక్ష‌న్ 120 కేర‌ళ పోలీసు చ‌ట్టం ప్ర‌కారం నిందితుడిపై త‌గిన ఆధారాలు ఉన్న‌ట్లు హైకోర్టు తెలిపింది.