Tuesday, January 7, 2025
Homeజాతీయంవాతావ‌ర‌ణ సూచ‌న‌ల కోసం ప్ర‌త్యేక వెబ్‌పేజీ

వాతావ‌ర‌ణ సూచ‌న‌ల కోసం ప్ర‌త్యేక వెబ్‌పేజీ

Date:

మ‌హా కుంభ‌మేళాకు ప్ర‌యాగ్‌రాజ్ సిద్ద‌మవుతోంది. మహా కుంభమేళాకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక వెబ్‌పేజీని రూపొందించినట్లు తెలిపింది. అందులో ప్రతి 15 నిమిషాలకోసారి వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చని ఐఎండీ డైరెక్టర్‌ మనీశ్‌ రణాల్కర్‌ తెలిపారు. అంతేకాకుండా రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలను జారీ చేస్తామని వెల్లడించారు. ‘రాబోయే మహా కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వెబ్‌పేజీని ప్రారంభించాం. అందులో ప్రతి 15 నిమిషాలకోసారి వాతావరణ పరిస్థితిని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలు ఈ వెబ్‌పేజీలో అందుబాటులో ఉంటాయి’ అని మనీశ్‌ రణాల్కర్‌ తెలిపారు.

మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో 45 కోట్లమంది భక్తులు పాల్గొని గంగాస్నానం ఆచరిచేం అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో పాల్గొనే భక్తుల సౌకర్యం కోసం 1,60,000 టెంట్లు, 1,50,000 మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తారు. 1,250 కిలోమీటర్ల పైప్‌లైనును సిద్ధం చేస్తున్నారు. 67 వేల ఎల్‌ఈడీ లైట్లు, 2 వేల సోలార్‌ లైట్లు, 3 లక్షల మొక్కలు ఏర్పాటవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలు, ఆర్‌ఎఫ్‌ఐడీ రిస్ట్‌బ్యాండ్స్‌, యాప్‌ ట్రాకింగ్‌లతో భక్తులను లెక్కిస్తారు.