Tuesday, January 7, 2025
Homeజాతీయంఢిల్లీని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

ఢిల్లీని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం

Date:

దేశ రాజ‌ధాని ఢిల్లీని రాబోయే ఐదేళ్ల‌లో కాలుష్య ర‌హిత న‌గ‌రంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. దేశ రాజధాని రవాణా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. గత నవంబర్‌ నుంచి ఢిల్లీలో కాలుష్య స్థాయి ఎక్కువగానే ఉన్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పాటు ఢిల్లీలో బీఎస్‌-3 పెట్రోల్‌, బీఎస్‌-4 డీజిల్‌ కార్లను రెండుసార్లు నిషేధించారు. ఇటీవల గాలి నాణ్యత సూచీ 350 వరకు చేరింది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 కింద ఆంక్షలు మళ్లీ తీసుసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కార్లపై మరోసారి నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీలోని వాతావరణ కాలుష్యానికి కారణాల్లో వాహనాలు ఉద్గారాలు సైతం ఒకటి. ఢిల్లీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కోట్ల పెట్టుబడిని కేంద్రమంత్రి తెలిపారు.

అదనంగా రూ.12500 కోట్ల సీఆర్‌ఐఎఫ్‌ ఫండ్‌ని సైతం ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి రహదారుల మంత్రిత్వ శాఖ ఏయే ప్రాజెక్టులను ప్రారంభించబోతుందో ఆయన వివరించారు. వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ జామ్‌లతో ఢిల్లీ ఇబ్బందులపడుతుందని.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీని ఆయా సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రారంభించిందన్నారు.