కేంద్ర ప్రభుత్వం నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే. లేని పక్షంలో పై తరగతులకు అనుమతించరు. ఇకపై 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసే అవకాశం ఉంది. 5, 8 తరగతుల విద్యార్థులకు పరీక్షల్లో ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఫెయిలైన వారు 2 నెలల్లో పాస్ అయితే పైతరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. నో డిటెన్షన్ విధానం విద్యాహక్కు చట్టం ద్వారా అమల్లోకి వచ్చింది.
అయితే ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3 వేల స్కూళ్లకు మాత్రమే వర్తించనుంది. ఇందులో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే నో డిటెన్షన్ విధానాన్ని 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు రద్దు చేశాయి. ఈ నిబంధనను అమలు చేయడం అనేది రాష్ట్రాల వ్యక్తిగత నిర్ణయం అని కేంద్రం పేర్కొంది.