దేశవ్యాప్తంగా రష్యా ప్రయోగించిన 72 డ్రోన్లలో.. 47 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం కీలక ప్రకటన చేసింది. టెలిగ్రామ్‌లో దీనిపై ఆ దేశ సైన్యం ప్రకటన చేసింది. తమ మిలిటరీ తొమ్మిది ప్రదేశాల్లో దాడుల్ని తిప్పికొట్టిందన్నారు. కీవ్ ప్రాంతంలో అనైక ప్రైవేటు ప్రదేశాలు, ఇండ్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కెమిలిన్‌స్టికి ప్రాంతంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. విద్యుత్తు లైన్ దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 25 డ్రోన్లు లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని ఉక్రెయిన్ తెలిపింది.