Sunday, December 22, 2024
Homeజాతీయంమూడు మార్గాల్లో పంజాబీ రైతులు రైల్ రోకో

మూడు మార్గాల్లో పంజాబీ రైతులు రైల్ రోకో

Date:

ఛ‌లో ఢిల్లీ ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో పంజాబీ రైతులు రైల్ రోకో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఆ రైతులు ఇప్పుడు రైళ్ల‌ను ఆపేస్తున్నారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు రైళ్ల‌ను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో మూడు గంట‌ల పాటు రైల్ రోకో నిర్వ‌హించారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని రైతులు ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మ‌జ్దూర్ మోర్చాలు రైల్ రోకో నినాదాన్ని ఇచ్చాయి. రైల్వే ట్రాకుల‌పై రైతులు బైఠాయించిన‌ట్లు కిసాన్ మ‌జ్దూర్ మోర్చా నేత స‌ర్వాన్ సింగ్ పందేర్ తెలిపారు. ఢిల్లీ మార్చును అడ్డుకోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి 13వ తేదీ నుంచి శంభూ, క‌న్నౌరి బోర్డ‌ర్ల మ‌ధ్య రైతులు ధ‌ర్నా చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.

క‌న్నౌరు బోర్డ‌ర్ పాయింట్ వ‌ద్ద పంజాబీ రైతు జ‌గ్జీత్ సింగ్ ద‌ల్లేవాల్ ఆమ‌ర‌ణ దీక్ష చేప‌డుతున్నారు. పంట‌ల‌కు ఎంఎస్పీ ఇవ్వాల‌ని కేంద్రాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 101 మంది రైతులు డిసెంబ‌ర్ 6,8, 14వ తేదీల్లో ఢిల్లీలో ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఆ ప్ర‌య‌త్నాలను హ‌ర్యానా భ‌ద్ర‌తా ద‌ళాలు అడ్డుకున్నాయి. పంట‌ల‌కు ఎంఎస్పీతో పాటు రుణ‌మాఫీ, పెన్ష‌న్‌, విద్యుత్తు ధ‌ర‌ల త‌గ్గింపు, పోలీసు కేసులు ఎత్తివేత లాంటి డిమాండ్ల‌పై రైతులు పోరాడుతున్నారు.