Thursday, December 26, 2024
Homeతెలంగాణతెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రండి

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రండి

Date:

తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.

ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంద‌ర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.