ప్రజలను నిరసనలతో ఇబ్బంది పడకూడదని సుప్రీంకోర్టు రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్‌కు సూచించింది. హైవేలను దిగ్బంధించొద్దని.. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరసన తెలుపుతున్న రైతులను ఒప్పించండని రైతు నేతలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతునేత జగ్జీత్ సింగ్ దల్వాల్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కుందన్న బెంచ్ పేర్కొంది. రైతులు లేవనెత్తిన సమస్యలను కోర్టు గుర్తించిందని.. వాటిని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతంగా నిరసనలు నిర్వహచ్చవ్చని.. కానీ, ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని పిటిషనర్ దల్లెవాల్ తరపు న్యాయవాదికి ధర్మాసనం చెప్పింది. రైతుల నిరసన సరైనదా? తప్పా? అన్న దానిపై తాము వ్యాఖ్యానించడం లేదని చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చట్టం ప్రకారం శాంతియుతంగా నిరసనలు నిర్వహించేందుకు దల్లేవాల్ నిరసనకారులను ఒప్పించగలరని అన్నారు. ప్రస్తుతం తాము దల్లేవాల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని.. అయితే తర్వాత సంప్రదించవచ్చని ధర్మాసనం పేర్కొంది.