Thursday, December 26, 2024
Homeజాతీయంజార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

జార్ఖండ్‌ సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

Date:

జార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరేన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.

రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి హేమంత్‌ సోరెన్‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు షిబు సోరెన్‌, రూపి సోరెన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌, ఎంపీ రాఘవ్‌ చద్ధా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్‌ సోరెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.