Friday, December 27, 2024
Homeజాతీయంప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తార‌ని ఎదురుచూస్తున్న‌

ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తార‌ని ఎదురుచూస్తున్న‌

Date:

వ‌య‌నాడ్ ఉప‌ ఎన్నికలో ప్రజలు తనకు ఓ అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నట్లు ప్రియాంకా గాంధీ తెలిపారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేరళలోని వక్ఫ్‌ చట్టం, కొండ చరియలు విరిగిపడిన వయనాడ్‌ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సహాయం అందకపోవడం వంటి విషయాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. బుధ‌వారం ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదంటూ ఆమె సమాధానమిచ్చారు.

వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3లక్షల మెజార్టీతో రాహుల్‌ గాంధీ విజయం సాధించారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంతోపాటు యూపీలోని రాయ్‌బరేలీలోనూ రాహుల్‌ గెలుపొందడంతో వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ప్రియాంకను ఐదు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ప్రియాంక వయనాడ్‌లో పార్టీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించి.. కీలకపాత్ర పోషించారు. కేరళలో పాలక్కాడ్‌, చెలక్కర అసెంబ్లీ స్థానాలతోపాటు వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నిక నేడు జరుగుతుండగా.. నవంబర్‌ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.