Thursday, November 14, 2024
Homeప్రత్యేక కథనాలుఈ రైలు నాన్‌స్టాప్‌గా 493 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తోంది

ఈ రైలు నాన్‌స్టాప్‌గా 493 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తోంది

Date:

దేశంలో భార‌తీయ రైల్వే రోజురోజుకు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఎన్నో వినూత్న రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. అందులో భాగంగానే వందేభారత్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది చివరలో ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది. తక్కువ ఛార్జీలతో అన్ని సౌకర్యాలు ఉండే నాన్ ఏసీ వందే సాధారణ్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి.

ఏకంగా 493 కిలోమీటర్ల ప్రయాణం

ఈ ఏడాది చివరలో తొలి హైడ్రోజన్ రైలు నడవబోతోంది. వందేభారత్‌ను మించిన వేగంతో ఇది ప్రయాణించబోతోంది. వందేభారత్ కంటే ముందే పట్టాలెక్కిన ఓ సాధారణ ఎక్స్ ప్రెస్ రైలు దేశంలో అత్యంత పొడవైన నాన్ స్టాప్ రైలుగా పేరు తెచ్చుకుంది. ఎక్కడైతే బయలుదేరిందో తర్వాత స్టేషన్ చేరుకోవడానికి నాన్ స్టాప్‌గా 493 కిలీమీటర్లు ప్రయాణిస్తుంది. దేశంలో ఇదే తొలి రైలు. దీనిపేరు ముంబయి సెంట్రల్ – హపా దురంతో ఎక్స్ ప్రెస్. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ప్రతిరోజు రాత్రి 11.00 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4.50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. మధ్యలో కేవలం రెండు స్టేషన్లలోనే ఆగుతుంది. ముంబయి-హపా రైలు తర్వాత పుణె-హౌరా దురంతో ఎక్స్ ప్రెస్ కూడా అతి పొడవైన నాన్ స్టాప్ రైళ్ల జాబితాలోకెక్కింది. పుణెలో బయలుదేరిన తర్వాత నాన్ స్టాప్‌గా 465 కిలోమీటర్లు ప్రయాణించి రాజస్థాన్‌లోని కోటా స్టేషన్‌లో ఆగుతుంది. ఇదే దాని తొలి స్టేషన్.

ప్రపంచంలో నాలుగో స్థానంలో

ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ పరంగా నాలుగో స్థానంలో నిలిచిన భారతీయ రైల్వే రోజురోజుకు నూతన హంగులను సమకూర్చుకుంటోంది. డబుల్ లైన్స్ ఉన్నచోట, రద్దీ ఎక్కువగా ఉండే డివిజన్లలో మూడోలైను నిర్మాణ పనులు చేపడుతోంది. దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. ఒడిసాలో కోరమాండల్ ప్రమాదానికి గురైన తర్వాత సిగ్నలింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోసారి ఈ తరహా ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే ఉంది.