సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.