Thursday, December 26, 2024
Homeఅంతర్జాతీయంన్యూయార్క్‌లో బెంగాలీ భాష‌లో బ్యాలెట్‌

న్యూయార్క్‌లో బెంగాలీ భాష‌లో బ్యాలెట్‌

Date:

అగ్ర‌రాజ్యం అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అక్క‌డి ఎన్నిక‌ల‌పై ప్ర‌పంచ దేశాలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌ మొదలుకాగా.. నవంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్రమంలో న్యూయార్క్‌ రాష్ట్రం ఇంగ్లిష్‌కు అదనంగా మరో ఐదు భాషల్లో వీటిని ముద్రించగా.. అందులో భారతీయ భాష ‘బెంగాలీ’ ఉండటం విశేషం.

ఎన్నికల ప్రక్రియలో ఇంగ్లిష్‌ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించాం. చైనీస్‌, స్పానిష్‌, కొరియన్‌, బెంగాలీ భాషల్లో బ్యాలెట్‌ అందుబాటులో ఉంది’ అని న్యూయార్క్‌ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖేల్‌ జే రియాన్‌ పేర్కొన్నారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్‌ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకర అంశమన్నారు. అయితే, భారత్‌లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల ఎన్నికల ప్రక్రియలో బెంగాలీకి చోటు లభించింది. ఎన్నికల నిర్వహణలో అనేక దేశాలు ఏకీకృత వ్యవస్థను అనుసరిస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇందుకు భిన్నం. ప్రచార చట్టాలను ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల ప్రక్రియను మాత్రం ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ, పోలింగ్‌ సమయం, కౌంటింగ్‌ ప్రక్రియకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి.