లిక్కర్ చట్టప్రకారం మద్యం అనుమతించబడే రాష్ట్రాల్లో ఒక మనిషి కేవలం 2 లీటర్లు మాత్రమే తనతో పాటు క్యారీ చేసేందుకు వీలు ఉంటుంది. ఈ పరిమితిని మించినప్పుడు రూ.5000 జరిమానాతో పాటు కొన్ని సార్లు గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు శిక్ష విధించబడుతుందని గుర్తుంచుకోవాలి. దీనికోసం బస్సు ఆపరేటర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తప్పనిసరిగా సదరు లిక్కర్ బాటిళ్లకు సంబంధించిన బిల్లు కూడా క్యారీ చేయటం మంచిది.
ప్రస్తుతం గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కో వ్యక్తి సగటున 5.7 లీటర్ల మేర మద్యం తాగుతున్నట్లు తెలుస్తోంది. అధికంగా మద్యం తాగుతున్న ప్రాంతాల్లో అరుణాచల్‌ప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషులు మద్యం తాగేవారి సంఖ్య 52.6 శాతంగా ఉంది. ఇక తెలుగు రాష్టాల్లో తెలంగాణలో 43.4 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. దీంతో గతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు బదులుగా ప్రైవేటు వ్యక్తులకు షాపులను లాటరీ విధానంలో అందించింది. అలాగే ఎన్నికల్లో మాటిచ్చినట్లుగానే క్వార్టర్ మద్యాన్ని రూ.99కే విక్రయాలను ప్రారంభించింది.