Wednesday, October 30, 2024
Homeఅంతర్జాతీయంఆర్థిక ఇబ్బందుల‌తో విమాన‌యాన సంస్థ విక్రయం

ఆర్థిక ఇబ్బందుల‌తో విమాన‌యాన సంస్థ విక్రయం

Date:

ఆర్థిక ఇబ్బందుల‌తో త‌ల్ల‌డిల్లుతున్న పాకిస్తాన్ త‌న అంత‌ర్జాతీయ విమాన‌యాన సంస్థ‌ను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ సంస్థలో వాటాను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు పెట్టుబడిదారులు ఆసక్తి కనబర్చడం లేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఒక బిడ్డర్‌ మాత్రమే ప్రీ క్వాలిఫికేషన్ పత్రాలను సమర్పించారట.

పీఐఏలో 60 శాతం వాటాను కొనుగోలు చేసే అర్హత ఉన్న ఆరు సంస్థలను పాక్‌ ప్రభుత్వం ప్రీ క్వాలిఫై చేసింది. అయితే తర్వాత ఈ ప్రక్రియ నుంచి ఐదు సంస్థలు ఉపసంహరించుకున్నాయి. ఎయిర్‌లైన్స్‌కు ఉన్న ఆర్థిక కష్టాలు, కాలం చెల్లిన విమానాలు, నిర్వహణపరమైన ఇబ్బందులు వంటివాటిని కారణంగా చూపి పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కావాలంటూ సదరు సంస్థలు ప్రతిపాదనను తీసుకొచ్చాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 60 శాతం వాటాను 76 శాతానికి పెంచింది. ఆ క్రమంలోనే ఒక సంస్థ మాత్రమే ప్రీ క్వాలిఫికేషన్ పత్రాలు సమర్పించింది. ఒక ప్రాజెక్ట్‌ నిమిత్తం టెండర్ వేయడానికి అర్హత కలిగిఉన్నారో, లేదో నిర్ణయించే ప్రక్రియను ప్రీ క్వాలిఫైడ్‌ బిడ్‌ అంటారు. బిడ్డర్ అనుభవం, ఆర్థిక స్థితిగతులు, సాంకేతిక సామర్థ్యాలను పరిశీలిస్తారు.