పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా కొత్తకొత్త మిషన్లు పుట్టుకొస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు మనిషి జీవం ఎప్పుడు పోతుందో కూడా కచ్చితంగా అంచనా వేసి చెప్పే టెక్నాలజీని బ్రిటన్ సైంటిస్టులు కనిపెట్టారు. ఈసీజీ చేసి పల్సు రేటును ఫిగర్ ఔట్ చేసి.. ప్రాణం ఎప్పుడు పోతదో ముందే తెల్సుకోవచ్చట.. దానికి సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ కాలిక్యులేటర్ అని పేరు కూడ పెట్టారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ ఎన్హెచ్ఎస్ ట్రస్టు సహా రెండు పెద్ద హాస్పిటల్స్ ఆల్రెడీ దీని మీద టెస్టులు కూడా చేశారట.. మరో రెండు మూడేళ్లలో బ్రిటన్‌లోని అన్ని ఆస్పత్రుల్లో ఈ సూపర్ హ్యూమన్ ఏఐ డెత్ క్యాలిక్యులేటర్స్ అందుబాటులోకి వస్తాయంటున్నారు.
ఇప్పటివరకు చావు ఎప్పుడు వస్తదో తెలియదు కాబట్టి దాని గురించి ఫీకర్ లేకుండా చాలామంది హ్యాపీగా బతుకుతున్నారు. కానీ ఇప్పుడు టైం డేటు కూడా చెప్తే.. ఇక లైఫ్‌లో ప్రశాంతత ఎక్కడ ఉంటుంది. అదీగాక మనలాంటి దేశాల్లో పలాన రోజునాడు మీ ప్రాణం పోతదంటే ముహుర్తం.. వర్జ్యం, రాహుకాలం.. దుర్ముహుర్తం లేకుండా పలాన సమయంలో ప్రాణం పోవాలనే పట్టు పట్టేవాళ్లు కూడా ఎక్కువైపోతారు. ఇప్పుడు చూస్తలేమా.. డేట్లు , ముహుర్తాలు చూషి మరీ కాన్పులు చేయించుకుంటున్నారుగా.. ఇక డెత్ క్యాలిక్యులేటర్ వస్తే చావులకు కూడ ముహుర్తాలు పెట్టుకుంటారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.