ఆత్మనిర్భర్‌తో భారత్ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని మోడీ తెలిపారు. ‘మన్‌కీ బాత్’ 115వ ఎపిసోడ్లో ఆయన ప్రసంగించారు. దీపావళి పండగకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు. యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశ ప్రజలకు డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ స్కామ్‌లపై అవగాహన చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్‌తో భారత్ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోందని మోడీ తెలిపారు. ‘స్వయం సమృద్ధి అనేది కేవలం విధానం మాత్రమే కాదు. అది మన అభిరుచి. కొన్నేళ్ల క్రితం భారత్‌లో ఏదైనా క్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందని చెబితే ఎవరూ నమ్మేవారు కాదు. అపహాస్యం చేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి రంగంలోనూ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.
యువత మన సంస్కృతికి అద్దం పట్టే ఒరిజినల్ ఇండియన్ కంటెంట్‌ను రూపొందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీటిని వీక్షిస్తున్నారు. యానిమేషన్ రంగం నేడు ఇతర పరిశ్రమలకు బలం చేకూర్చేదిగా రూపుదిద్దుకుంది. వర్చువల్ రియాలిటీ టూరిజం నేడు ప్రసిద్ధి చెందుతోంది. అక్టోబర్ 28న ‘వరల్డ్ యానిమేషన్ డే’ జరుపుకోనున్నాం. భారత్‌ను గ్లోబల్ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు సంకల్పించాలి’ అని మోడీ పిలుపునిచ్చారు.