దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మారుమోగుతోంది. అయితే అతడికి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. అతడు కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్వ్యూకు అనుమతించినందుకు అక్కడి అధికారులపై పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2023 మార్చిలో ఒక టీవీ ఛానల్‌లో లారెన్స్‌కు సబంధించిన రెండు ఇంటర్వ్యూలు ప్రసారం అయ్యాయి.
ఈ వ్యవహారంపై పంజాబ్ – హరియాణా కోర్టు సిట్‌ను ఏర్పాటుచేసింది. పంజాబ్‌లోని జైలు నుంచి వీడియో కాల్ ద్వారా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడని సిట్ గుర్తించింది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఇది ప్రసారమైంది. దాంతో గ్యాంగ్‌స్టర్‌తో పోలీసులు చేతులు కలిపారంటూ అప్పట్లో మూసేవాలా తండ్రి ఆరోపించారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈవిధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయం గురించి మాట్లాడుతూ.. కెనడియన్లకు సంబంధించిన సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు సేకరించారని, వాటిని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు అందజేశారని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.