Wednesday, October 30, 2024
Homeతెలంగాణఈ సంవ‌త్స‌రం చ‌లి తీవ్ర‌త ఎక్కువే

ఈ సంవ‌త్స‌రం చ‌లి తీవ్ర‌త ఎక్కువే

Date:

తెలంగాణ రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. వచ్చే పది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.

పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల మధ్య నమోదవుతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా వస్తుంది. అయితే ఇది చలి కాలం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నవంబర్ లో హైదరాబాద్‌లో చలి తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నవంబర్‌లో పొడి వాతావరణం అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ సంవత్సరం చలి తీవ్ర తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెల్లవారుజామున చలితీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు అవుతాయని.. అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల చలి తీవ్రత తక్కువ ఉండొచ్చని పేర్కొంది.