Wednesday, October 30, 2024
Homeక్రైంచైనా ఫోన్ల‌కు ఐఫోన్ స్టిక్క‌ర్లతో విక్ర‌యం

చైనా ఫోన్ల‌కు ఐఫోన్ స్టిక్క‌ర్లతో విక్ర‌యం

Date:

క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌కుండా ఈజీ మ‌నీకి అల‌వాటు ప‌డుతూ మోసాల‌కు పాల్ప‌డే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. డ‌బ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఫలితంగా పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరంలో నకిలీ ఐఫోన్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. రూ.3 కోట్లు విలువ చేసే నకిలీ ఐఫోన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. టార్గెట్, పటేల్, ఆశాపూర్, నంది మొబైల్‌ షాపుల్లో చైనా మేడ్ ఫోన్లకు ఐఫోన్ స్టిక్కర్‌ అంటించి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. కొన్ని నెలలుగా నిందితులు యాపిల్ బ్రాండ్ పేరుతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఖైరతాబాద్, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లోని ఫైర్‌ క్రాకర్స్ గోదాముల్లోనూ పోలీసులు సోదాలు చేశారు. కాలం చెల్లిన బాణసంచా అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు. వారినుంచి రూ.లక్ష విలువ చేసే టపాసులను సీజ్‌ చేశారు.