Wednesday, October 30, 2024
Homeఅంతర్జాతీయంఅంత‌రిక్ష యాత్ర టూరిజం ప్ర‌వేశ‌పెట్టిన చైనా

అంత‌రిక్ష యాత్ర టూరిజం ప్ర‌వేశ‌పెట్టిన చైనా

Date:

చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అంత‌రిక్ష యాత్ర‌ టూరిజంను ప్రవేశపెట్టింది. 2027లో చేపట్టనున్న అంతరిక్ష పర్యటకానికి సంబంధించి టికెట్లను విక్రయించనుంది. చైనాకు చెందిన స్టార్టప్‌ డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈక్రమంలో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లోని రెండు సీట్ల టికెట్లు విక్రయానికి పెట్టనున్నట్లు తెలిసిందే. అయితే ఈ టికెట్టు ధర 1.5 మిలియన్‌ యువాన్లుగా (భారత కరెన్సీలో అక్షరాల రూ.1.77 కోట్లు) తెలిపింది. ఈ టికెట్లు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. సబ్‌ ఆర్బిటల్‌ ఫ్లైట్‌లో ప్రయాణికులను తీసుకువెళతామని తెలిపింది. అంటే రాకెట్‌ భూ వాతావరణాన్ని దాటి, అంతరిక్షం దరిదాపుల వరకూ వెళ్లి వస్తుంది.

వచ్చే నెలలో మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ తెలిపింది. పునర్వినియోగ రాకెట్లు అధిక ప్రయోగఖర్చులతో పాటు అంతరిక్ష ప్రయాణాల ఖర్చును తగ్గిస్తుందని వెల్లడించింది. 2025లో కక్ష్యలోని ఓ క్యారియర్‌ రాకెట్‌ను తిరిగి పొందాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు చైనాలోని మరిన్ని కంపెనీలు స్పేస్‌ టూరిజం రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు ప్రకటించాయి. 2028 నాటికి స్పేస్‌ టూరిజం విమానాలను ప్రారంభించనున్నట్లు సీఏఎస్‌ తెలిపింది.