Thursday, January 2, 2025
Homeతెలంగాణరైతుల కోసం ఎంత దూర‌మైనా వెళుతా

రైతుల కోసం ఎంత దూర‌మైనా వెళుతా

Date:

తెలంగాణ రైతులు క‌ష్టాల‌లో పాలుపంచుకుంటాన‌ని, రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన బిఆర్ఎస్‌ రైతు పోరుబాట’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా కేసులు పెట్టి వేధించే అధికారుల పేర్లు రాసిపెట్టాలని పార్టీ నేతలకు కేటీఆర్‌ సూచించారు.

”ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదు. మహిళలకు తులం బంగారం, రైతులకు రూ.15వేల రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్‌ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ప్రజలు పోలీస్‌స్టేషన్ల ముందు క్యూ కడితే మీ పరిస్థితేంటి? అధికారులు న్యాయం, ధర్మం ప్రకారం ముందుకెళ్లాలి. పైనుంచి వచ్చే ఒత్తిడులతో ఇష్టారీతిన వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. భారాస అధికారంలోకి వస్తే అలాంటి అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తాం” అని కేటీఆర్‌ అన్నారు.