Wednesday, October 30, 2024
Homeతెలంగాణపరువు నష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలం

పరువు నష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలం

Date:

మాజీ మంత్రి కేటీఆర్‌ పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని, పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. కేటీఆర్‌ వెంట సాక్షులు దాసోజు శ్రవణ్‌, సత్యవతి రాథోడ్‌, బాల్కసుమన్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నాంపల్లి కోర్టుకు వచ్చారు. కేటీఆర్‌తో పాటు దాసోజు శ్రవణ్‌ వాంగ్మూలాలు నమోదు చేసిన నాంపల్లి కోర్టు.. మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను ఈనెల 30న నమోదు చేయనుంది.