Thursday, October 31, 2024
Homeజాతీయంఢిల్లీలో దారుణంగా ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

ఢిల్లీలో దారుణంగా ప‌డిపోయిన గాలి నాణ్య‌త‌

Date:

ఢిల్లీలో వాతావ‌ర‌ణ మార్పుల‌కు అనుగుణంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోతున్నది. సోమవారం ఉదయానికి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని ‘వెరీ పూర్‌’ కేటగిరిగా వర్గీకరించింది. వాయు కాలుష్యం కారణంగా నగరంపై దట్టంగా పొగ మంచు కమ్మి ఉంటోంది. దాంతో ఉదయం పూట వాహనదారులు రోడ్లపై విజిబిలిటీ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గాలి నాణ్యతలు క్షీణించడంతో ఢిల్లీ వాసులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ సమస్యలు తీవ్రంగా పెరిగాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే బాణాసంచా వినియోగం, తయారీపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది శీతాకాలంలో చల్లదనం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత దెబ్బతింటున్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మాత్రం లభించడంలేదు.