Saturday, September 21, 2024
HomeUncategorizedరాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు

రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు

Date:

రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయి. తెలంగాణ తల్లి అంటే.. మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. మన ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో అయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంటే గడీలో ఉండే మహిళ కాదు.. శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి. అందెశ్రీ అనే కవి తెలంగాణకు గొప్ప గీతాన్ని అందించారు. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమంలో అందరికీ స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రం వచ్చాక జయజయహే రాష్ట్ర గీతం అవుతుందని అందరూ ఆశించారు. కానీ, ఆ పాటను నిషేధించినంత పని చేశారు.

ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలు, బోర్డులపై అందరూ టీజీ అని రాసుకున్నారు. కొందరు యువకులు తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్టు వేయించుకున్నారు. కేంద్రం తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొంది. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు గుర్తొచ్చేలా టీఎస్‌ అని పెట్టింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం.

ప్రజలు ఇబ్బందులు పడితే బాగుండని విపక్షం కోరుకుంటోంది. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ప్రధాన విపక్షనేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. పరిస్థితిని చక్కదిద్దుతూ ఈ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. మంచి పనులను అభినందించే సద్బుద్ధి విపక్ష నేతలకు లేదు” అని సీఎం విమర్శించారు.