చెన్నై మెట్రోలో డ్రైవర్ లేకుండా నడిచే ట్రైన్లు రాబోతున్నాయి. చెన్నై మెట్రో రికార్డు క్రియేట్ చేయబోతుంది. త్వరలోనే చెన్నై మెట్రోలో డ్రైవర్ లెస్ ట్రైన్లు పట్టాలెక్కబోతున్నాయి. ఈ డ్రైవర్ లెస్ ట్రైన్లను మెట్రోపోలిస్ అని పిలుస్తారు. మొత్తం 36 డ్రైవర్ లెస్ ట్రైన్లు త్వరలోనే చెన్నైకి చేరనున్నాయి. ఈ ట్రైన్లను ఫ్రెంచ్ రైళ్ల తయారీ దారు సంస్థ అల్స్టన్ తయారుచేస్తుంది. డ్రైవర్ లేకుండా నడిచే ఈ ట్రైన్లు కేవలం రెండేసీ బోగీలను మాత్రమే కలిగి ఉంటాయి. రండి ఈ ట్రైన్లు ఎక్కడ ప్రయాణిస్తారో, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
చెన్నై మెట్రలో త్వరలో ప్రారంభం కానున్న డ్రైవర్ లెస్ ట్రైన్స్ చెన్నైలోని పూనమెల్లి బైపాస్ నుంచి లైట్ హౌజ్ వరకు నడుస్తాయి. ఈ ట్రైన్లు మొత్తం 26 కిలోమీటర్లు క్యారిడార్లో నడవనున్నాయి. ఈ ట్రైన్లకు డ్రైవర్ ఉండడు కదా. మరి ఎలా నడుస్తాయి అన్న సందేహం మీకు కలుగొచ్చు. డ్రైవర్ లెస్ ట్రైన్లు ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ సిస్టమ్ తో నడుస్తాయని తయారీ సంస్థ ఆల్ స్టన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ట్రైన్స్ పూర్తిగా డ్రైవర్ సహాయం లేకుండానే నడుస్తాయి. డ్రైవర్ లేకుండా నడిచే విధంగా టెక్నాలజీని వినియోగించినట్లు తయారీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ట్రైన్స్ ముమ్మాటికి డ్రైవర్ లేకుండానే నడుస్తాయి. అయితే, ఇవి పూర్తి మానవ ప్రమేయం లేకుండా నడిచే ట్రైన్స్ మాత్రం కావు. ఈ డ్రైవర్ లెస్ ట్రైన్స్‌ను కంట్రోల్ సెంటర్ నుంచి అపరేట్ చేస్తారు. ఈ ట్రైన్లు కంట్రోల్ సెంటర్ లోని ఆపరేటర్ల పర్యవేక్షణలో నడుస్తాయి. ఇందులో భాగంగానే ఈ ట్రైన్లో ప్రయాణించేవారితో ఆపరేటర్ మాట్లేడుందుకు, ఆదేశాలు జారీ చేసేందుకు మెట్రో ఇంటర్ కామ్ సిస్టమ్‌లను వారు వినియోగిస్తారు.