Wednesday, October 30, 2024
Homeతెలంగాణమూడు కాదు.. నాలుగు నెల‌లు ఉంటా

మూడు కాదు.. నాలుగు నెల‌లు ఉంటా

Date:

మూసీ పునరుజ్జీవనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. మూసీ విషయంలో రేవంత్ తమ పైన చేసిన ఆరోపణలను హరీష్ తిప్పి కొట్టారు. తన రియల్‌ ఎస్టేట్‌ కలలను గ్రాఫిక్‌ హంగులతో చూపించారన్నారు. రేవంత్‌ చూపించింది రివర్‌ ఫ్రంట్‌ అని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న వారికి మేలు జరుగుతుంది అంటే తాను వెళ్లి మూసీ బఫర్‌ జోన్‌లో మూడు నెలలు కాదు.. 4 నెలలు ఉంటానని హరీష్ ప్రకటించారు.

మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతూనే..ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల పైన హరీష్ స్పందించారు. రూ.1100 కోట్లతో ప్రాజెక్ట్‌ చేపట్టారని వెల్లడించారు. రేవంత్‌ రెడ్డి ఆ ప్రాజెక్టును మార్చి రూ.4 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. మూసీలో 99 శాతం మంది సుందరీకరణ వద్దంటున్నారని చెప్పుకొచ్చారు. నల్గొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.