Wednesday, October 30, 2024
Homeతెలంగాణస్కిల్ యూనివ‌ర్సిటీకి అదానీ భారీ విరాళం

స్కిల్ యూనివ‌ర్సిటీకి అదానీ భారీ విరాళం

Date:

తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. 100 కోట్ల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, దాన కిశోర్, తదితరులు ఉన్నారు.

ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.