Thursday, October 31, 2024
Homeజాతీయంసుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన గ్రూప్‌-1 అభ్య‌ర్థులు

సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన గ్రూప్‌-1 అభ్య‌ర్థులు

Date:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్ష వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని గ్రూప్‌-1 అభ్యర్థులు కోరుతున్నారు. జనరల్‌ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వుడుగానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా.. రిజర్వేషన్‌ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరుతున్నారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదం నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షల నిలిపివేయాలని కొందరు అభ్యర్థులు కోరగా.. హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ రద్దు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం.. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ -1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.