Thursday, October 31, 2024
Homeజాతీయంపారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ స్వ‌ర్గ‌ధామం

Date:

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం ప‌లుకుతామ‌ని, పెట్టుబడి దారులకు ఆంధ్రప్రదేశ్‌ స్వర్గధామం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ ఇప్పుడు కొత్త అత్యుత్తమ విధానాలతో ఆహ్వానం పలుకుతోందన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన చండీగఢ్‌లో ఎన్డీయే సీఎంల కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ , మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా, ఒడిశా, మణిపూర్‌, ఛత్తీస్‌గఢ్‌, సీఎంలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ”ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యాపార అనుకూల రాష్ట్రం. కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ పరిశ్రమ అనుభవజ్ఞులతో రూపొందించాం. వ్యవస్థాపక స్ఫూర్తి, వ్యాపారాలను పెంపొందించడమే లక్ష్యం. దేశంలోనే అత్యుత్తమ వ్యాపార అనుకూల వ్యవస్థను నిర్మిస్తున్నాం. అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. దేశంలో, ఏపీలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదు. ఈ ఉత్తేజకరమైన వృద్ధి ప్రయాణంలో మాతో సహకరించండి. వ్యాపార పరిధిలు, రాష్ట్ర సామర్థ్యం పరస్పరం విస్తరించుకునే అవకాశమిది. ఏపీలో నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.