Wednesday, October 16, 2024
Homeతెలంగాణఐఏఎస్‌లు ఉన్న‌ది ప్ర‌జా సేవ కోస‌మే..

ఐఏఎస్‌లు ఉన్న‌ది ప్ర‌జా సేవ కోస‌మే..

Date:

ఐఏఎస్‌లు ఉన్నది ప్రజాసేవకోసమే.. క్యాడ్ ఎక్కడికి ఆర్డర్ ఇస్తే.. అక్కడికి వెళ్లాలని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఏపీలో ప్రజలు వరదలతో బాధపడుతుంటే, వారికి సేవ చెయ్యాలని మీకు లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఐఏఎస్‌ల బాధ్యతను హైకోర్టు గుర్తు చేసింది. తెలంగాణలోనే ఉంటామనడం సరికాదన్న హైకోర్టు.. అసలు రిపోర్ట్ చెయ్యకుండా విచారణ చెయ్యమనడం సరికాదని తెలిపింది. ముందు రిపోర్ట్ చెయ్యాలని సూచించింది. అసలు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు తెలిపింది. అంతేకాదు.. స్టే ఇస్తే, ఇక ఈ అంశం ఎప్పటికీ తేలదనీ, స్టేలతోనే కాలం గడుస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు ఐఏఎస్‌లు రిపోర్ట్ చెయ్యాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక వారు తెలంగాణ నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. లేదంటే వారు మళ్లీ న్యాయపోరాటం చెయ్యాల్సి ఉంటుంది. ఐతే.. రిపోర్ట్ చెయ్యడానికి అక్టోబర్ 16 సాయంత్రం 5 గంటల వరకే టైమ్ ఉంది కాబట్టి.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఐఏఎస్‌లుగా బాధ్యతలు తీసుకున్నప్పుడే.. వారు ఆల్ ఇండియా సర్వీసుల్లో పనిచెయ్యాల్సి ఉంటుంది. అలా కాకుండా తమను ఒక చోటే ఫిక్స్‌గా ఉంచాలని కోరడం సరైన నిర్ణయం అనిపించుకోదు. అందుకే ఆ సేవలను అఖిల భారత సేవలు అంటారు. అందుకు ఎంపికయ్యేవారు దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా పనిచెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. అలా చేస్తారు కాబట్టే, వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇదే విషయాన్ని హైకోర్టు గుర్తుచేసినట్లైంది. ఇప్పటికీ వారు ఏపీకి వెళ్లకూడదని డిసైడ్ అయితే, సమాజం వారి నిర్ణయాన్ని సమర్థించకపోవచ్చని నిపుణులు అంటున్నారు.