Saturday, December 21, 2024
Homeజాతీయంపాకిస్థాన్‌ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి

పాకిస్థాన్‌ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి

Date:

పాకిస్థాన్‌ పర్యటనకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సిద్ధమయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని ఇచ్చే డిన్నర్‌లో జైశంకర్‌ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో విదేశాంగ మంత్రి పాక్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ మంగళవారం ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. అనంతరం సభ్యదేశాల ప్రతినిధులకు పాక్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఇచ్చే విందులో జైశంకర్‌ పాల్గొనే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఆయన పాకిస్థాన్‌లో 24గంటల కంటే తక్కువ సమయమే ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సమావేశానికి చైనా, రష్యా ప్రధానులు కూడా హాజరుకానున్నారు. ఇందుకోసం చైనా ప్రధాని ఇప్పటికే ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. సభ్యదేశాల నుంచి ముఖ్యులు రానున్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌ మొత్తం భద్రతావలయంలో ఉంది.