కోల్‌కతాకు చెందిన ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన నేపథ్యంలో మృతురాలికి న్యాయం జరగాలంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా కోల్‌కతాలోని కలకత్తా మెడికల్ కాలేజ్‌కు చెందిన 60 మంది సీనియర్ డాక్టర్లు తమ రాజీనామాలను సమర్పించారు. మంగళవారం ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరంతా రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.