Saturday, September 21, 2024
HomeUncategorizedదేశవ్యాప్తంగా ఒకే దేశం-ఒకే స్టూడెంట్ ఐడీ

దేశవ్యాప్తంగా ఒకే దేశం-ఒకే స్టూడెంట్ ఐడీ

Date:

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యారంగంలో సేవల్ని ఏకీకృతం చేసే లక్ష్యంతో జాతీయ విద్యావిధానంలో భాగంగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ(అపార్)ను ప్రారంభించింది. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్దులకు సైతం పట్టణాలు, నగరాల్లో ఉన్న వారితో సమానంగా అవకాశాలు లభించేలా ఈ కొత్త వ్యవస్ధ పనిచేయబోతోంది. దీంతో ఒకే దేశం-ఒకే స్టూడెంట్ ఐడీని అందుబాటులోకి రానుంది.

దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో ఉన్న ఉమ్మడి సేవా కేంద్రాలను (సీఎస్‌సీ) వాడుకుంటూ ఈ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)ను ఏర్పాటు చేశారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన అపార్.. ‘వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ’ అనే ఏకీకృత విద్యార్థి గుర్తింపు వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఏర్పాటుతో కాలేజ్ లేదా యూనివర్శిటీ అడ్మిషన్ల కోసం ఏబీసీ ఐడీని కలిగి ఉండటం తప్పనిసరి కానుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాల లేదా విశ్వవిద్యాలయ విద్యార్థులను అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)లో నమోదు చేసుకోవాలని కూడా ఇది సూచిస్తోంది. విద్యార్ధులు తమ అకడమిక్ క్రెడిట్స్ ను ఒకే చోట నమోదు చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఛైర్మన్ అనిల్ సహస్రబుద్ధే వెల్లడించారు. ఈ తాజా విధానం వల్ల ఫిజికల్ గా సర్టిఫికెట్లను దాచుకునే పాత విధానం స్ధానంలో సులభతరమైన డిజిటల్ క్రెడిట్స్ అందుబాటులోకి వస్తాయి.

ఇలా ఒకే చోట సర్టిఫికెట్లన్నీ అకడమిక్ క్రెడిట్స్ రూపంలో స్టూడెంట్ ఐడీతో ఉంటే విద్యాసంస్ధలు కూడా వాటిని సులువుగా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనుంది. తాజా విధానం ప్రకారం ఆయా ప్రోగ్రామ్ లలో విద్యార్థులకు తాత్కాలిక అపార్ ఐడీలను జారీ చేస్తారు. వాటిని ఆధార్‌తో ధృవీకరించడంతో పాటు డిజీ లాకర్‌కు లింక్ చేస్తారు. దీంతో సమర్ధవంతంగా రికార్డు కీపింగ్ తో పాటు వాడుకునే అవకాశం లభిస్తుంది.