Saturday, January 4, 2025
Homeఅంతర్జాతీయంఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేద్దాం

ఇరాన్‌ అణుస్థావరాలపై దాడి చేద్దాం

Date:

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులకు ప్రతీకారంగా దాని అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందా అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ అణుస్థావరాలపై దాడికి ఆదేశాలు ఇవ్వాలని అధికార పార్టీ నాయకుడు లికుద్‌ ఎమ్‌కే మోష్‌ సాద ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి మీడియా కథనాలు ఉటంకిస్తున్నాయి.

‘ప్రధానమంత్రి నెతన్యాహు ఇజ్రాయెల్‌కు ఏది మంచిదో అది చేయాలని నేను భావిస్తున్నా. ప్రత్యేకమైన చారిత్రాత్మక అవకాశాన్ని కలిగిఉన్నాం. అణుస్థావరాలపై దాడి చేయమని ఆయన ఆదేశించడమే ఆలస్యం. ఇటీవల ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో కాకుండా అణుబాంబులను ఉపయోగించి దాడులు చేసుంటే మా పౌరుల పరిస్థితి ఏంటి. వాళ్లు ఏం చేసేవారు? ఇరాన్‌ అణుస్థావరాలపై దాడులు సాధ్యమేనని నేను భావిస్తున్నా. ఈ చర్యలకు ఆదేశాలు ఇచ్చేముందు యూఎస్‌తో సంప్రదింపులు జరపాలని కోరుకుంటున్నా’ అని సాద పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్‌ ప్రతిజ్ఞ చేసింది.