Wednesday, December 25, 2024
Homeజాతీయంహరియాణాలో ఫలితాలపై విశ్లేషణ చేపట్టాం

హరియాణాలో ఫలితాలపై విశ్లేషణ చేపట్టాం

Date:

హరియాణాలో కాంగ్రెస్ పరాజయంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ  తాజాగా స్పందించారు. ఈ అనూహ్య ఫలితాలను తాము విశ్లేషిస్తున్నామని తెలిపారు. ఈమేరకు ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేశారు.

”జమ్మూకశ్మీర్‌ ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ గెలుపు మన రాజ్యాంగం సాధించిన విజయం. ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం. హరియాణాలో అనూహ్య ఫలితాలపై మేం విశ్లేషణ చేపట్టాం. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. హరియాణాలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థికన్యాయం, నిజం కోసం మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల గళాన్ని మేం వినిపిస్తూనే ఉంటాం” అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.