Monday, October 7, 2024
Homeజాతీయంశబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ..

శబరిమల అయ్యప్ప ప్రసాదంలో కల్తీ..

Date:

తిరుమల తర్వాత వెంకటేశ్వరస్వామి ఆలయం తర్వాత అంతే గుర్తింపు పొందిన శబరిమల ఆలయం ప్రసాదంలో కూడా కల్తీ జరిగినట్టుగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శబరిమలలో ప్రసాదంగా ఇస్తున్న అరవణలో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిసినట్లు నిర్ధారించడంతో ఈ అరవణను వాడకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం 6.65 లక్షల కంటైనర్లలో ఉన్న ఈ అరవణ ప్రసాదాన్ని ఎరువుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో గత ఏడాదిగా ఈ ప్రసాదం నిల్వలో ఉంది. దీనిని వాడకుండా ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో అనుమతించిన మోతాదును మించి క్రిమిసంహారకాలు కలవడమే.

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి, ఈ కలుషితమైన ప్రసాదాన్ని శాస్త్రీయంగా పారబోసేందుకు టీడీబీ (త్రవాంకోర్ దేవస్వం బోర్డు) టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్‌ను ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) దక్కించుకుందని టీడీబీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు. వారు ఈ కలుషిత ప్రసాదాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియను ప్రారంభిస్తారని, మొదట కేరళలోని కొట్టాయంలో ఉన్న గూడెంకి తీసుకెళ్లి, అక్కడ నుంచి హైదరాబాద్‌కి తీసుకెళ్లి ఎరువుగా మారుస్తారని తెలియజేశారు.